![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి కార్తీక దీపం సీజన్ 2 టీమ్ వచ్చి సందడి చేయబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నటించే చిన్నారిని శ్రీముఖి "పాపా నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా" అని ."నాకు ఇద్దరూ ఇష్టమే" అని చెప్పింది. వెంటనే హరి ఆ పిల్ల పరువు తీసేసాడు. "ఆల్రెడీ నీకు అవార్డు ఇచ్చేసారు మళ్ళీ పెర్ఫార్మెన్స్ చేయకు " అన్నాడు. దాంతో ఆ చిన్నారు సీరియస్ గా చూసింది హరి వైపు. తర్వాత నారి నారి నడుమ మురారి టైపులో ఒక వైపు నుంచి దీప అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ "బావా ఒకసారి రావా" అంటూ డాక్టర్ బాబును గోముగా అడిగింది. మరో వైపు కార్తీక్ మరదలు కరకరా నమిలేశాల చూసింది. తర్వాత దీప, గాయత్రి ఇద్దరూ కలిసి "భామా భామ బంగారు " సాంగ్ కి డాన్స్ చేశారు. "పరివారం వస్తుంది ఎవ్రి వీకు...ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటాడు ఈ కార్తీకు" అంటూ మరదలు గాయత్రి చెప్పింది. "రోడ్డు మీద వెళ్తుంది కారు.
నా మనసులో ఉంటారు నా బాబు గారు" అంటూ దీప చెప్పేసరికి అందరూ గట్టిగా నవ్వారు. "నేనేం చేసాను పాపం. మేమెళ్లి చేసుకుంటాం కార్తీక దీపం " అని చెప్పాడు డాక్టర్ బాబు. "షూటింగ్లో కోప్పడకుండా ఫ్రెండ్లీగా ఉండేది ఎవరు " అని అడిగింది శ్రీముఖి. అది దీప అని చెప్పారు. "కోపం మా వంటలక్కకు ఎక్కువొస్తుంది అంటారా" అంది శ్రీముఖి. "కోపం తిక్క " అంటారు అని చెప్పాడు డాక్టర్ బాబు. "దీప డాక్టర్ బాబులో ఎవరు లేజీ " అని శ్రీముఖి అడిగింది . "మా బావే " అని చెప్పింది గాయత్రి. "ఇద్దరిలో టెక్స్ ఎక్కువ తీసుకునేది ఎవరు " అనేసరికి అందరూ దీప వైపు వచ్చేసారు. "వీళ్ళ లాంటి వాళ్ళతో పని చేయడం వలన నేను ఎక్కువ టేక్ లు తీసుకోవాల్సి వస్తోంది " అని చెప్పింది. ఫైనల్ గా అవినాష్ "ఈవిడ సెలెబ్రేషన్స్ కి పిలిచిందా గొడవలు పెట్టడానికి పిలిచిందా"? అంటూ శ్రీముఖి మీద కౌంటర్ వేసాడు.
![]() |
![]() |